

హైదరాబాద్ నగర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అండర్‌పాస్, స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్‌వే విధానం కొనసాగనుంది. ఇప్పటికే ఈ విధానంపై ట్రయల్ రన్‌లు నిర్వహించి ట్రాఫిక్ ప్రవాహాన్ని పరిశీలించారు.
కొత్త ట్రాఫిక్ విధానంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న నిర్దేశిత రెండు లైన్ల రోడ్లలో ఒకే దిశలో వాహనాలను అనుమతించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు ట్రాఫిక్‌ను నియంత్రిత విధానంలో నడపనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర సేవల వాహనాలకు అవసరమైన మినహాయింపులు ఉంటాయి. కేబీఆర్ పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చే వారి కోసం రోడ్డు దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, రోడ్లపై వాహనాలను పార్క్ చేయవద్దని పోలీసులు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!