

టెలివిజన్ ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. టీవీ ప్రసార రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు డిజిటల్ మీడియాతో సమాన పోటీ వాతావరణాన్ని కల్పించేందుకు పాత ప్రకటనల పరిమితిని తొలగించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2026ను ఆగస్టు 21న గెజిట్‌లో నోటిఫై చేసిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గంటకు గరిష్ఠంగా 12 నిమిషాల ప్రకటనల ప్రసారానికి సంబంధించిన 2006 నాటి నిబంధనను రద్దు చేసింది.
2006లో దేశంలో కేవలం 62 అనలాగ్ టీవీ ఛానెళ్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం డిజిటలైజేషన్, డీటీహెచ్, ఐపీటీవీ వంటి సాంకేతికతలతో 900కు పైగా ఛానెళ్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు యూట్యూబ్, ఓటీటీ వంటి డిజిటల్ వేదికలపై ఇలాంటి ప్రకటనల పరిమితులు లేవు. ప్రకటనల ఆదాయంపై ఎక్కువగా ఆధారపడే సంప్రదాయ టీవీ ఛానెళ్లకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయం లక్ష్యమని కేంద్రం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!