
జనరల్

అర్జున అవార్డు గ్రహీత, తెలంగాణకు చెందిన ప్రముఖ షూటర్ ధనుష్ శ్రీకాంత్ శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనీ బాలాదేవి ధనుష్ శ్రీకాంత్‌ను అభినందించి, షూటింగ్‌లో సాధించిన అద్భుత విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణతో పాటు దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ధనుష్ శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు. షూటింగ్ క్రీడలో ఆయన సాధించిన విశిష్ట విజయాలను అభినందిస్తూ, తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అనిత, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్, రవితేజ, రవీందర్, పీఆర్‌ఓ కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!