
జనరల్

చంద్రయాన్-3 విజయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత్, గగన్యాన్ వంటి ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. అయితే ఇదే సమయంలో ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం కేంద్రాన్ని ఆందోళనకు గురి చేసింది. గత కొన్ని నెలల్లో 100 మందికిపైగా సైంటిస్టులు రాజీనామా చేసినట్లు సమాచారం.
జూలై 14న విడుదలైన మెమో ప్రకారం కీలక మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను ఇకపై కేంద్ర స్థాయిలోనే ఆమోదిస్తారు. అధికారిక కారణాలు వెల్లడించకపోయినా, ప్రైవేట్ స్పేస్ రంగం విస్తరణ, మెరుగైన అవకాశాలు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. నిపుణులను నిలబెట్టుకోవాలంటే పని వాతావరణం, కెరీర్ అవకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మాజీ అధికారులు సూచిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!