

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ జంతర్‌మంతర్‌లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని, ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అవసరమైన అన్ని వైద్య చికిత్సలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమని, వాటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
మరో 48 గంటలు దీక్ష కొనసాగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్‌చుక్ దాదాపు 9 కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు తెలిపారు. అయితే తన ఆరోగ్యం క్షీణించినప్పటికీ అత్యంత ప్రమాదకర స్థితిలో లేదని వీడియో సందేశంలో పేర్కొన్న వాంగ్‌చుక్, దీక్ష విరమించాలని కోరవద్దని, బదులుగా జూలై 20న నిర్వహించనున్న 'చలో సంసద్' శాంతియుత ర్యాలీలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతు తెలపాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!