

ఎల్-నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయంగా రూపొందించిన రాష్ట్ర తొలి కంటింజెన్సీ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
ఈ ప్రణాళికలో జిల్లాల వారీగా, మండలాల వారీగా వర్షపాతం లోటు వివరాలు, రానున్న రెండు నెలల వాతావరణ అంచనాలు, జిల్లా కలెక్టర్లు మరియు అధికారులకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు పొందుపరిచారు. భారత వాతావరణ శాఖ (IMD) అందించే సమాచారాన్ని నిరంతరం విశ్లేషిస్తూ రైతులకు పంటల ఎంపిక, నీటి వినియోగం, వ్యవసాయ నిర్వహణపై శాస్త్రీయ సూచనలు అందిస్తామని మంత్రి తెలిపారు. పంట నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!