
సినిమాలు

నారా చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగలో రైతులు భూమిని, పశుసంపదను పూజిస్తూ ప్రకృతితో అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటారని ఆయన పేర్కొన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల ఇళ్లలో పాడిపంటలతో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ప్రకృతి సాగును ప్రోత్సహిస్తూ సంప్రదాయాలను కొనసాగించాలని సీఎం సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మంచి పంటలు పండించాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!