

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు పంపిన మూడు కంటైనర్ల మిర్చి సరుకును అక్కడి అధికారులు తిరస్కరించి వెనక్కు పంపించారు. మిర్చిలో అనుమతించిన పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం గుంటూరు మిర్చి రైతులు, ఎగుమతిదారుల్లో ఆందోళనకు దారితీసింది.
ఎగుమతి చేసిన మిర్చిలో మిథామిడోపాస్ అనే పురుగుమందు అవశేషాలు అధిక స్థాయిలో గుర్తించబడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో చైనా అధికారులు సరుకును తిరస్కరించినట్లు సమాచారం. రైతు సంఘాలు ఈ పురుగుమందుపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే రైతులకు సురక్షిత ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించి, ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పంట ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!