

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ విద్యార్థుల ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే మరింత పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్టుల పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారే దేశ భవిష్యత్తని అభిజిత్ దిప్కే పేర్కొన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులు వెంటనే ఆపాలని, నిరసనకారులపై పెల్లెట్ గన్ వినియోగానికి అనుమతి ఇచ్చిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ, ప్రభుత్వం ప్రజల ఆందోళనలను పట్టించుకోకపోతే యువత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వాన్నే మార్చే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!