
క్రీడలు

రాజ్యసభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల చర్యలను ప్రస్తావించారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించారని ఆరోపించిన ఆయన, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఈ ఘటనకు అమిత్ షా బాధ్యత వహించాలని, సభలో దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అనంతరం రాజ్యసభ ఛైర్మన్ ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!