
జనరల్

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారని, అందుకోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బీజేపీలో చేరాలని హెచ్చరిస్తున్నారని, అలా చేయకపోతే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ ఘటనను అత్యంత తీవ్రమైన అంశంగా అభివర్ణించిన అభిజీత్ దీప్కే, బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులకు స్థానం లేదని పేర్కొంటూ, తన కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!