

ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దు అటవీ ప్రాంతంలో గత వారం చెలరేగిన భారీ కార్చిచ్చు క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా సుమారు 42 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఇది ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగర విస్తీర్ణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని అధికారులు తెలిపారు. మంటల ముప్పు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, పరిస్థితి మెరుగుపడటంతో వారిలో 84 వేల మందికి తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
ప్రస్తుతం గాలిలో తేమశాతం పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడం సులభమైందని అధికారులు తెలిపారు. గత రాత్రి మంటలు మరింత విస్తరించలేదని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరిస్తూ 2,200 మంది అగ్నిమాపక సిబ్బంది మరియు 20 అగ్నిమాపక విమానాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా బోర్డో ప్రాంతంలో కురిసిన వర్షంతో పరిస్థితులు మరింత మెరుగుపడినట్లు అధికారులు పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!