
జనరల్

సాయికృష్ణ మృతి కేసులో జ్యుడిషయల్ రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజును ఎనిమిది రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసులో అసలు విషయాలు బయటపడాలంటే నాగరాజు విచారణ కీలకమని భావిస్తున్నారు. సాయికృష్ణ ఎలా మరణించాడు, శవానికి ఏమైంది అన్న అంశాలు ఇంకా స్పష్టతకు రాలేదు. ఈనెల 9 నుంచి 16 వరకు విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనే జరగనుంది.
కేసులో ఆధారాలు సేకరించేందుకు సిట్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనుంది. ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించినప్పటికీ కీలక వివరాలు వెలుగులోకి రావడం లేదు. సాయికృష్ణకు చికిత్స చేసినట్లు చెప్పబడుతున్న ఆర్‌ఎంపీ డాక్టర్ కనిపించకపోవడం కేసుకు మరింత మిస్టరీని జోడించింది. అతడిని ఎవరు పిలిచారు అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!