
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల అంశాన్ని ఆధారంగా చేసుకుని సనాతన ధర్మంపై విపక్షాలు దాడి చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని తరచుగా మార్చుకుంటున్నాయని, రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించినవారే ఇప్పుడు మత విశ్వాసాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలపై మౌనం వహిస్తూ రామాలయ విరాళాలపై ఆరోపణలు చేయడం ద్వారా సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన అన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోరిందని, ఆ బృందం ద్వారా నిజాలు వెలుగులోకి వస్తాయని తాను హామీ ఇచ్చినట్లు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!