
జనరల్

భారాస తిరిగి అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో రైతులతో సమావేశమై వారి అనుభవాలు తెలుసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం సృష్టికర్త కేసీఆర్ దూరదృష్టితో ఆయిల్‌పాం సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారని, వరితో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా ఈ పంటను ప్రోత్సహించామని పేర్కొన్నారు.
తమ పాలనలో 1.5 లక్షల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలకు ఈ పంట విస్తీర్ణం పెరిగిందని, ప్రస్తుత ప్రభుత్వ సహకారం కొనసాగితే అది 7 లక్షల ఎకరాలకు చేరుతుందని కేటీఆర్ తెలిపారు. హెచ్‌సీఎల్‌లో పనిచేస్తున్న అనిల్ అనే ఐటీ ఉద్యోగి ఏడెకరాల్లో సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నట్లు చెప్పారు. తక్కువ నీటితో అధిక లాభాలు సాధ్యమవుతున్నాయని రైతులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!