
జనరల్

సాధారణ రెవెన్యూ పరిపాలనలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల సవరణ, కనిపించని సర్వే నంబర్ల నమోదు, మ్యుటేషన్ వంటి అంశాలపై పెద్ద సంఖ్యలో పిటిషన్‌లు దాఖలవుతున్నాయని పేర్కొంది. అధికారులు నిర్ణీత కాలంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తే ఈ సమస్యలు కోర్టుకు రాకుండా కార్యాలయ స్థాయిలోనే పరిష్కారం కావచ్చని అభిప్రాయపడింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన హన్మండ్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ రెవెన్యూ శాఖను ఎస్‌ఓపీ రూపొందించి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గత అక్టోబర్‌లో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఎనిమిది నెలలుగా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు. తదుపరి విచారణను ఆగస్టు 8కు వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!