

రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూలైలో 69 శాతం వర్షపాతం లోటు నమోదైందని అధికారులు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణంగా 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఈసారి కేవలం 551 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అంచనాల కంటే ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని అధికారులు వివరించారు.
పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరి పంటలు ప్రభావితమయ్యే అవకాశముందని వెల్లడించారు. 122 హైరిస్క్ మండలాలను గుర్తించిన ప్రభుత్వం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు, అత్యవసర విత్తన ప్రణాళిక, బోర్ల ఆధారంగా సాగు, పంటల బీమా నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. వంశధార జలాలను వినియోగించి పంటలను కాపాడాలని, పశుగ్రాస కొరత లేకుండా తగిన నిల్వలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!