
రాజకీయాలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 68,771 మంది భక్తులు దర్శించుకోగా.. 25,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.6.94 కోట్ల ఆదాయం సమకూరింది.
ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వరుస సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 13వ తేదీన బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆ సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించనుంది. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం భక్తుల నుంచి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోరని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!