

మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పేవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సీఎం సమీక్షించారు.
ఈ సందర్భంగా భూ సేకరణ పూర్తికాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్లు పిలవొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సేకరణ కోసం ప్రత్యేక అధికారిని ఇప్పటికే నియమించినట్లు వెల్లడించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో అభివృద్ధి పనుల అనుమతుల కోసం అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే సైబరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ విగ్రహం మరియు జంక్షన్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ వేగవంతం చేయాలని ఆదేశించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) భవనం, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!