

ఒకప్పుడు డిజిటల్ వేదికపై సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీ ఇప్పుడు ‘మిర్జాపూర్: ది మూవీ’తో బాక్సాఫీస్‌పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. నివేదికల ప్రకారం తొలి రోజు భారత్‌లో రూ.25.75 కోట్ల నెట్, రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.93.75 కోట్లకు చేరుకున్నాయి. నాలుగో రోజుకే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం.
రిపోర్ట్ చేసిన గణాంకాల ప్రకారం భారత్‌లో ఈ సినిమా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.112.35 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్‌లో దాదాపు రూ.20 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.132 కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకు కలిసొస్తున్నట్లు సమాచారం. మిర్జాపూర్ సింహాసనం కోసం జరిగే ఆధిపత్య పోరు, పాత పగలు, కొత్త శత్రుత్వాల చుట్టూ సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పంకజ్ త్రిపాఠి కాళీన్ భయ్యాగా, అలీ ఫజల్ గుడ్డూ పండిట్‌గా, దివ్యేందు మున్నా భయ్యాగా మరోసారి కనిపించారు. రవికిషన్ కొత్తగా చేరగా, బబ్లూ పండిట్ పాత్రలో విక్రాంత్ మాస్సే స్థానంలో జితేంద్ర కుమార్ నటించారు. రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!