
జనరల్

కొద్దిరోజుల విరామం అనంతరం అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమైంది. జమ్ములోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి తొలి విడతగా దాదాపు 5 వేల మంది భక్తులు బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహ ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒకటైన బాల్తాల్ రూట్‌లో యాత్రికులు భద్రతా బలగాల పర్యవేక్షణలో ప్రయాణం కొనసాగిస్తున్నారు.
యాత్రికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్గమంతా వైద్య బృందాలు, అత్యవసర సేవలు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించి యాత్ర సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టారు. యాత్రలో పాల్గొనే భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!