

అమెజాన్ భారీగా పెట్టుబడి పెట్టడంతో తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు పై బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రూ.60 వేల కోట్ల వ్యయంతో ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. దీని ప్రభావంతో రంగారెడ్డి జిల్లాలో మరిన్ని కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటు పై దృష్టి సారించాయి. రెవెన్యూ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు కందుకూరు, చేవెళ్ల మండలాల్లో సుమారు 1500 ఎకరాల భూమిని గుర్తించి భూసేకరణ చర్యలు చేపడుతున్నారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. నిరంతర విద్యుత్, నీటి సరఫరా కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ, అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు ఈ ప్రాంతానికి మెరుగైన అనుసంధానాన్ని అందించనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!