
జనరల్

ఢిల్లీలో అక్రమ, అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎంసీడీ అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణాలను తొలగించేందుకు అవసరమైన చోట బుల్డోజర్లను వినియోగించాలని సూచించారు. ఈ చర్యలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అలాగే ఢిల్లీలోని అన్ని పీజీ హాస్టళ్లలో సమగ్ర తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్లలో అనుమతులు, నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. భవనాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!