26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

Writer: Chandrika 05:39 AM, 26 జులై, 2026
నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌-యూజీ వివాదంపై దేశవ్యాప్తంగా కొనసాగిన విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన రాజీనామా లేఖలో గత పది రోజుల పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. విద్యార్థులు రాజకీయ, న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టి తమ కెరీర్‌ను నిర్మించుకోవాలన్న ఉద్దేశంతోనే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. పరిస్థితికి తాను బాధ్యత తీసుకున్నానని, బాధ్యత నుంచి ఎన్నడూ తప్పించుకోలేదని స్పష్టం చేశారు. ప్రధాన్‌ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే దిల్లీలోని జంతర్‌మంతర్‌లో సీజేపీ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. దీన్ని విద్యార్థులు, ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా సీజేపీ అభివర్ణించింది.

కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన చర్చల అనంతరం తమ మిగిలిన డిమాండ్లకు కూడా ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించిన కాక్రోచ్‌ జనతా పార్టీ 36 రోజుల ఆందోళనను విరమించింది. విద్యార్థులపై నమోదైన పోలీసు కేసుల ఉపసంహరణతో పాటు నీట్‌ వివాదంతో ముడిపడి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సీజేపీ ప్రతినిధులు తెలిపారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఈ విజయాన్ని వ్యవస్థలో మార్పు కోసం సాగించే పోరాటంలో తొలి అడుగుగా అభివర్ణించారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రధాన్‌ రాజీనామాను విద్యార్థుల నిరంతర పోరాటానికి దక్కిన విజయంగా పేర్కొన్నాయి. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీల నివారణ, జవాబుదారీతనంపై తదుపరి చర్చలు కొనసాగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

ట్యాగ్లు
ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ యూజీనీట్ ప్రశ్నపత్రం లీక్సీజేపీ ఉద్యమంకాక్రోచ్ జనతా పార్టీఅభిజీత్ దీప్కేజంతర్ మంతర్ నిరసనవిద్యార్థుల ఉద్యమంకేంద్ర విద్యాశాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సినిమాలు

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’
ఓటీటీ

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి
జనరల్

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..
జనరల్

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ
సినిమాలు

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా
జనరల్

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?
జనరల్

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌
జనరల్

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
జనరల్

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది
జనరల్

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి
జనరల్

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!