

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్స్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ సాగించిన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్న ధీరజ్.. ఆంధ్రప్రదేశ్‌లోని యువ క్రీడా ప్రతిభకు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులోనూ ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ధీరజ్ బొమ్మదేవరకు మంత్రి నారా లోకేశ్ కూడా అభినందనలు తెలిపారు. ఆయన సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ క్రీడా కీర్తిని ప్రపంచస్థాయికి చాటిందని అన్నారు. ఇదే సమయంలో మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన భారత జట్టు ఎనిమిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడం గొప్ప విజయమని పేర్కొన్నారు. ఈ విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించడం రాష్ట్రానికి గర్వకారణమని లోకేశ్ అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!