
గాసిప్స్

తన ఓటు తొలగించలేదని ఈసీ అధికారులు చేసిన ప్రకటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. అధికారులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తన ఓటు తొలగించారని వీడియో చేసిన తర్వాత అధికారులు తనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని చెప్పారని, అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తొలగించి, పొరపాటు జరిగిందని మరో వీడియో పెట్టాలని అధికారులు కోరారని చెప్పారు.
అనంతరం హడావుడిగా వెబ్‌సైట్‌లో తన ఓటు స్టేటస్‌ను ‘షిఫ్టెడ్’గా మార్చి, కొన్ని మీడియా సంస్థలకు సమాచారం పంపి తాను అబద్ధం చెప్పినట్లుగా చిత్రీకరించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. దేశ పౌరులు తమ ఓటు హక్కు కోసం క్యూలో నిలబడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు. త్వరలో అన్ని ఆధారాలతో ప్రెస్‌మీట్ నిర్వహిస్తానని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!