

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఎన్టీఆర్‌కు గాయం కావడంతో పాటు ఆపరేషన్ జరిగిందనే వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ స్వయంగా నోట్ విడుదల చేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా సర్జరీ అనంతరం ఎన్టీఆర్ దిగిన ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ ఫొటోలో ఆయన చేతికి బెల్ట్ వేసుకుని ఆసుపత్రి సిబ్బందితో కలిసి కనిపించారు. దీంతో సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!