
సినిమాలు

ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు మృతి చెందగా 41 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 225 మందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో సుమారు 271 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఈ నౌక సురబయలోని తంజుంగ్ పెరాక్ పోర్ట్ నుంచి మకాసర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత మంటలు చెలరేగినట్లు కెప్టెన్ సమాచారం అందించగా, అనంతరం నౌకతో సంబంధాలు తెగిపోయాయి. అగ్నికి ఆహుతవుతున్న ఫెర్రీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికులు నౌక ముందు భాగంలో చేరి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!