
సినిమాలు

భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో తొలి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ, వరద విధుల్లో ఉన్న అధికారులు గోదావరి వరద మాన్యువల్ ప్రకారం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో సుమారు 9.32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద సుమారు 14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!