
జనరల్

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూలైన్లు, కౌంటర్లు, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, కూలర్లు, అంబులెన్స్‌లు, వైద్య శిబిరాలు వంటి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ వరకు కొనసాగనుంది. చివరి వ్యక్తి వరకు ప్రసాదం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్, షీ టీమ్స్, ట్రాఫిక్ నియంత్రణ, ఫైర్ సేఫ్టీ, సిపిఆర్ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!