
జనరల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. గంజాయి సరఫరాకు సంబంధించిన సమాచారం అందడంతో ఈగల్ ఫోర్స్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 30 మందికి పైగా అనుమానిత విద్యార్థులను తనిఖీ చేయగా, వారిలో 17 మందికి నిర్వహించిన పరీక్షల్లో గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం.
విచారణలో అస్సాం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు ఈగల్ బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఈ వివరాలపై అధికారికంగా మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. హైదరాబాద్‌లో గంజాయి వినియోగం, సరఫరాపై ఈగల్ ఫోర్స్ ఇప్పటికే విస్తృతంగా నిఘా కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!