
టెక్నాలజీ

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)ను తెలంగాణ మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టులో నీటిమట్టం, వరద ప్రవాహం, నీటి నిర్వహణపై సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ తెలంగాణకు గర్వకారణమని, ప్రాజెక్టు పూడికతీతకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నీటి విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!