
సినిమాలు

‘డిసీ’ బ్లాక్‌బస్టర్ విజయంతో చిత్ర బృందంపై నిర్మాత కళానిధి మారన్ ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్‌లను అభినందించిన ఆయన, వారికి సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా కార్ల తాళాలను స్వయంగా అందజేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించగా, లోకేశ్ కనగరాజ్ తొలిసారి హీరోగా నటించారు. వామిక గబ్బి కథానాయికగా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు.
పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ‘డిసీ’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు వసూళ్ల పరంగా కూడా సత్తా చాటింది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం సన్ నెక్స్ట్ వేదికగా ఈ నెల 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!