
సినిమాలు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ టాస్క్‌ఫోర్స్, ఆర్‌జీఐఏ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఎనిమిది కిలోల గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టైన నిందితుడిని ఒడిశాకు చెందిన రాజ్ ప్రధాన్‌గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్ బ్రాడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!