
క్రీడలు

ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, సియాన్ సబ్‌వే పూర్తిగా నీటమునిగింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వర్షాలతో ముంబైలో సగటున 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు నగరం మరియు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!