

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో టీమిండియా అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. పిచ్‌ను స్పిన్నర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారని తెలిపింది. పరుగులు చేయడం కష్టంగా ఉన్న పిచ్‌పై సమర్థంగా ఆడి విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇలాంటి పిచ్‌లపై చిన్న భాగస్వామ్యాలే విజయానికి కీలకమని హర్మన్‌ప్రీత్ తెలిపింది. రిచా ఘోష్, దీప్తి శర్మ అద్భుతంగా రాణించారని, కఠినమైన పిచ్‌పై షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ చేయడం విశేషమని ప్రశంసించింది. ఫైనల్‌లోనూ ఇదే దూకుడుతో ఆడి టైటిల్ సాధించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లలో విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!