

మేషం: గ్రహబలం పూర్తిగా అనుకూలంగా లేకపోయినా ఏకాగ్రతతో ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం, సమయపాలన పాటించడం మంచిది. పోటీదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధైర్యం, సహనం కలిసివస్తాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాల పఠనం శుభప్రదం.
వృషభం: ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో పేరు, గౌరవం పెరుగుతాయి. ధన, వస్త్ర సంబంధిత లాభాలు పొందే అవకాశం ఉంది. మీ సామర్థ్యానికి తగిన ప్రశంసలు లభిస్తాయి. సూర్య నమస్కారాలు చేయడం మేలు చేస్తుంది.
మిథునం: కార్యానుకూలత మెరుగ్గా ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టేందుకు అనువైన సమయం. సానుకూల పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. లక్ష్యసాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు పొందుతారు. గురు ధ్యానం శుభప్రదం.
కర్కాటకం: మానసిక స్థైర్యాన్ని కాపాడుకోవడం అవసరం. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. పోటీదారులపై పైచేయి సాధించే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న సమస్యలు ఎదురైనా సమయస్ఫూర్తితో పరిష్కరించగలుగుతారు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
సింహం: ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలు లభిస్తాయి. దైవానుగ్రహం తోడుగా ఉండి లక్ష్యసాధనకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. శ్రీ మహాలక్ష్మి ఆరాధన శుభప్రదం.
కన్య: ముందస్తు ప్రణాళికతో పనులను నిర్వహించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు, ఏమరుపాటు ఇబ్బందులకు కారణమవుతాయి. అవసరమైన సమయంలో ఆప్తుల సహకారం లభిస్తుంది. దైవానుగ్రహం అండగా నిలుస్తుంది. ఇష్టదైవ నామస్మరణ మనోస్థైర్యాన్ని పెంచుతుంది.
తుల: కాలం అనుకూలంగా సాగుతుంది. అధికార పరిధితో పాటు బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ప్రోత్సాహకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. దృఢమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.
వృశ్చికం: ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలి. పని ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా బాధ్యతలు నిర్వర్తించడం మంచిది. కీలక విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాల పఠనం మేలు చేస్తుంది.
ధనుస్సు: ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. కార్యసాఫల్యానికి అనుకూలమైన సమయం. ఆత్మస్థైర్యం పెరిగి ప్రతి విషయంలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రారంభించిన పనులను ఆశించిన విధంగా పూర్తి చేయగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం.
మకరం: ప్రారంభించిన కార్యక్రమాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వస్త్ర, ధాన్య సంబంధిత లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
కుంభం: ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ప్రధాన నిర్ణయాల సమయంలో పెద్దల సూచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్ ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం శుభప్రదం.
మీనం: ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. పరిస్థితులు పలు అంశాల్లో మీకు అనుకూలంగా మారతాయి. శుభవార్తలు ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మొహమాటంతో అవసరానికి మించిన ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడాలి. ధన వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!