16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Chandrika 11:28 PM, 31 ఆగస్టు, 2026
'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన దిగ్గజ ఆటగాడు లియోనెల్‌ మెస్సీకి తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా మెస్సీతో కలిసి ఫుట్‌బాల్‌ మైదానంలో కొన్ని నిమిషాలు గడపడం తనకు గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన GOAT మెస్సీ ప్రయాణం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. 2005లో అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన మెస్సీ.. అసాధారణ ప్రతిభ, నిరంతర శ్రమ, అచంచలమైన పట్టుదలతో ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు, అరుదైన రికార్డులతో ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారని తెలిపారు.

మైదానంలోనే కాకుండా సమాజ సేవలోనూ మెస్సీ ప్రత్యేకత చాటుకున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యునిసెఫ్‌తో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, లియో మెస్సీ ఫౌండేషన్‌ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ క్రీడాభిమానులను ప్రోత్సహించిన తీరు చిరస్మరణీయమన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ యువతను తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రయత్నాలకు మెస్సీ పర్యటన మరింత స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. క్రీడాస్ఫూర్తి, పట్టుదల, ఏకాగ్రత, నిరంతర సాధన, వినయం, అంకితభావానికి మెస్సీ ప్రతిరూపమని పేర్కొన్నారు. ఫుట్‌బాల్‌ ఉన్నంతకాలం మెస్సీ పేరు, ఆయన ముద్ర, స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా మెస్సీకి మరోసారి అభినందనలు తెలిపిన సీఎం.. ఇకపై సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

ట్యాగ్లు
లియోనెల్‌ మెస్సీరేవంత్‌రెడ్డితెలంగాణ సీఎంమెస్సీ రిటైర్మెంట్‌అంతర్జాతీయ ఫుట్‌బాల్‌అర్జెంటీనా ఫుట్‌బాల్‌హైదరాబాద్‌మెస్సీ భారత పర్యటనఫుట్‌బాల్‌ దిగ్గజంలియో మెస్సీ ఫౌండేషన్‌యునిసెఫ్‌తెలంగాణ క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!