

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాల్సిన సీఎం, ప్రతి సందర్భంలో కేసీఆర్‌పై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను దూషించడం మానుకోవాలని ఆయన సూచించారు. పదేళ్ల పాలనలో సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధితో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం తన పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు, హైడ్రా చర్యలు, మూసీ ప్రాజెక్టు, భూముల వ్యవహారాలపై వస్తున్న విమర్శలు, నిరసనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు నిలబెట్టుకున్నారో, ఎవరు విస్మరించారో తెలంగాణ సమాజానికి తెలుసని అన్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!