
సినిమాలు

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం భారీగా కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు చేప ప్రసాదం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించగా, ఇప్పటివరకు 50 వేల మందికి పైగా చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమం కోసం ఫిషరీస్ శాఖ సుమారు 3 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా, అవసరాలకు అనుగుణంగా అదనపు చేప పిల్లలను తీసుకురావడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!