
జనరల్

జియగూడా మఠంలోని సాధువులపై కొందరు గుర్తు తెలియని దుండగులు విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సాధువులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మఠం భూములను ఆక్రమించేందుకు దుండగులు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాదారుల నుంచి మఠం భూమిని రక్షించేందుకు సాధువులు చాలాకాలంగా పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని సాధువులు కోరుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!