9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

Writer: Nithish 02:44 PM, 9 సెప్టెంబర్, 2026
తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. సెప్టెంబరు 15 నుంచి 23 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఉద్యోగుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులు, ఉద్యోగులకు ఇచ్చే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో రెండు రకాల ఇన్సూరెన్స్ విధానాలను అమలు చేయనున్నారు. అలాగే 48 కేటగిరీల టీటీడీ ఉద్యోగుల వేతనాల పెంపునకు ఆమోదం లభించింది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా సిద్ధం చేయనున్నారు. అదనంగా 400 మంది పోటు సిబ్బందిని నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరారు. తిరుమల హోటళ్ల నుంచి సేకరించే తడి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేసి, నిత్యాన్నప్రసాద భవనంలో వంటలకు వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్సవాల్లో 25 రాష్ట్రాల నుంచి 27 సాంస్కృతిక బృందాలతో పాటు సింగపూర్, జపాన్ కళాకారులు పాల్గొననున్నారు. భక్తుల భద్రత కోసం 3,000 మంది పోలీసులతో కలిపి మొత్తం 5,600 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబరు 15న సీఎం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, గరుడ సేవ రోజున అదనపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు
ట్యాగ్లు
తిరుమలటీటీడీతిరుమల బ్రహ్మోత్సవాలుశ్రీవారి బ్రహ్మోత్సవాలుతిరుమల భక్తులుఇన్సూరెన్స్టీటీడీ పాలకమండలిశ్రీవారి దర్శనంలడ్డూ ప్రసాదంతిరుమల వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...