

సింగపూర్ రాజకీయ నాయకుల వేతనాలను 60 శాతానికి పైగా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ప్రధాని లారెన్స్ వాంగ్ వార్షిక వేతనం సుమారు రూ.16.5 కోట్ల నుంచి రూ.27 కోట్లకు చేరనుంది. ఉప ప్రధాని, కేబినెట్ మంత్రుల వేతనాలు కూడా సవరించనున్నారు. మంత్రుల జీతాలు వారి సీనియారిటీ, నిర్వహించే శాఖ ప్రాధాన్యతను బట్టి నిర్ణయించనున్నారు. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 4 లక్షల డాలర్లతో పోలిస్తే సింగపూర్ ప్రధాని వేతనం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.
అధిక వేతనాలు ప్రతిభావంతులను ప్రజాసేవలోకి ఆకర్షించడంతో పాటు సమర్థవంతమైన పాలనకు దోహదం చేస్తాయని లారెన్స్ వాంగ్ పార్లమెంటుకు తెలిపారు. తన వేతనంలో పెరిగే అదనపు మొత్తాన్ని ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచి నాయకత్వంపైనే మంచి ప్రభుత్వం ఆధారపడి ఉంటుందన్నది సింగపూర్ అనుసరించే ప్రాథమిక సూత్రమని పేర్కొన్నారు. కొత్త వేతన విధానం అక్టోబర్ 15 నుంచి పనితీరును బట్టి దశలవారీగా అమల్లోకి రానుంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో సింగపూర్ ఒకటిగా కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!