
జనరల్

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోదీను హాజరుకావాలని ఇరాన్ ప్రభుత్వం ఆహ్వానించినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. జూలై 5 నుంచి 9 వరకు టెహ్రాన్, ఖోమ్ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించనుండగా, చివరి సంస్కారాలు మషాద్‌లో జరుగనున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు.
టెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందినట్లు సమాచారం. ఆయన మరణంతో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయని, కుమారుడు మొజ్తాబా కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!