

అమెరికా దాడులను కొనసాగిస్తే మరిచిపోలేని పాఠం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి విలువ లేదని పేర్కొంటూ, ఆ ఒప్పందంలోని హామీలను ఇరాన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టిందని ఆరోపించిన ఖమేనీ, అవసరమైతే ఇరాన్ తన సైనిక శక్తిని ఉపయోగించి గట్టి సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉధృతమైంది. అమెరికా ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక రవాణా వ్యవస్థలు, భూగర్భ ఆయుధ నిల్వలను లక్ష్యంగా చేసుకోగా, ప్రతిగా ఇరాన్ కువైట్‌లోని డీశాలినేషన్ ప్లాంట్లు, చమురు క్షేత్రాలపై దాడులు చేసింది. ఇరాక్ ఇర్బిల్‌పై డ్రోన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించగా, జోర్డాన్ ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు తెలిపింది. నీటి వనరులు, డీశాలినేషన్ ప్లాంట్లపై పెరుగుతున్న దాడులు పశ్చిమాసియాలో మానవతా సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!