

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను తన నిరాహార దీక్షను విరమించాలని కోరారు. మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వాంగ్‌చుక్ చేపట్టిన శాంతియుత నిరసనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆయన డిమాండ్లపై స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే అధికారం, ధనానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. వాంగ్‌చుక్ సంకల్పం దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజాస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం పోరాటానికి బలం చేకూరుస్తుందని అఖిలేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!