

జపాన్‌కు చెందిన వ్యాపారవేత్త షోజీ మోరిమోటో తన ప్రత్యేకమైన ఆలోచనతో ‘ఏమీ చేయని వ్యక్తి’గా ఉంటూనే ఆదాయం సంపాదించే మార్గాన్ని సృష్టించుకున్నారు. 2018లో కార్పొరేట్ ఉద్యోగంలో చొరవ చూపడం లేదనే కారణంతో ఉద్యోగం కోల్పోయినట్లు సమాచారం. ఆ తర్వాత అదే అంశాన్ని తన వ్యాపారానికి ప్రత్యేకతగా మార్చుకుని, మాట్లాడాల్సిన అవసరం లేకుండా కేవలం తోడుగా ఉండే కంపానియన్ రెంటల్ సర్వీస్‌ను ప్రారంభించారు. దీంతో ఆయనకు ‘డూ నథింగ్ గై’ అనే గుర్తింపు వచ్చింది.
మోరిమోటో సేవల్లో మారథాన్ ముగింపు ప్రాంతంలో క్లయింట్‌తో కలిసి ఉండటం, వివిధ సందర్భాల్లో తోడుగా వెళ్లడం, వీడియో కాల్స్‌లో నిశ్శబ్దంగా కూర్చోవడం వంటివి ఉన్నాయి. ఇందులో క్లయింట్ ఏం చేయాలనుకుంటే అది చేయడమే తన పని అని, తన నుంచి ఎలాంటి లోతైన అనుబంధం లేదా ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఆశించాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ఈ వినూత్న వ్యాపార విధానం ద్వారా ఏడాదిలో సుమారు 80 వేల డాలర్ల ఆదాయం వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!