

పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘించారంటూ ఏఐ సంస్థపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బృందం రూ.7 వేల కోట్ల భారీ నష్టపరిహారం డిమాండ్ చేసినట్లు పేర్కొంది. అనుమతి లేకుండా ఊర్వశి పేరు, ఫొటోలు, వీడియోలను వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపించింది. “ఏఐ కంపెనీని అభివృద్ధి చేసుకోండి, మీ బ్రాండ్ విలువను పెంచుకోండి. కానీ ముందస్తు అనుమతి లేకుండా ఊర్వశి పేరును వ్యాపారంలోకి లాగొద్దు” అని ఆమె బృందం పేర్కొంది.
ఈ ఆరోపణలను ఏఐ సంస్థ సీఈఓ షీరాజ్ హసన్ ఖండించారు. సాంకేతికతపై సరైన అవగాహన లేకుండా ఇలాంటి డిమాండ్లు చేయడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా ఊర్వశి కృత్రిమ మేధస్సు, ముఖ్యంగా వినోద రంగంలో దాని భవిష్యత్ అవకాశాల గురించి తెలుసుకోవాలని సూచించారు. చనిపోయిన నటీనటులతో డిజిటల్‌గా ప్రదర్శనలు చేయించడం నుంచి పలు భాషల్లో డబ్బింగ్ వరకు ఏఐ ఆధారిత సాంకేతికత మరింత విస్తరించనుందని, ఈ మార్పును ఆపలేమని హసన్ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!