
జనరల్

తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. యాదిరెడ్డి మరణం అనంతరం ఆయన కుటుంబానికి అప్పటి ప్రభుత్వం అండగా నిలిచిందని, ఆయన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 500 గజాల స్థలం, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
యాదిరెడ్డి సోదరుడి కుమార్తె భవిష్యకు అవసరమైన శస్త్రచికిత్సను కేటీఆర్ చేయించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, పార్టీ తరఫున వారి ఆరోగ్య బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ యాదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!