

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చి, బాండ్ పేపర్లపై రాసిచ్చారని, అయితే వెయ్యి రోజులు దాటినా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.
రాష్ట్రంలోని రైతులు, సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, సర్వేయర్లు, పాలిటెక్నిక్ విద్యార్థులు తదితర వర్గాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని కేటీఆర్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 97 జీవో, ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం, భూ కేటాయింపులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను నెల రోజులపాటు నిర్వహించి అన్ని వర్గాల సమస్యలపై సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!